Indian | ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి

Indian | ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి

చర్చల ద్వారా చేసక్కటి పరిష్కారం..
యుద్ధం సమస్యలకు మార్గం కాదు
భారత్,ఇరాన్ సంబంధాలు బలోపేతం చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు వల్లూరు భార్గవ్..

Indian | విజయవాడ, ఆంధ్రప్రభ : శాంతి చర్చల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇన్చార్జ్ వల్లూరు భార్గవ్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు సంబంధించిన అంతర్జాతీయ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ… యుద్ధం ద్వారా సమస్యలు పరిష్కారం కావని, సంభాషణలు, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని తెలిపారు.

ఇండియన్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని వెల్లడిస్తూ, ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడి ఉన్న దేశమని, అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో సహకారం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులు, బలవంతం కాకుండా బహుపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్,ఇరాన్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడం అత్యంత కీలకమని అన్నారు.

ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తూ ఇరాన్‌తో బలమైన సంబంధాలను కొనసాగించాలని సూచించారు. ప్రపంచ నాయకులు డోనాల్డ్ ట్రంప్ బెంజమైన నేతన్యాహు, నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కఠిన వైఖరి ప్రపంచ శాంతికి ముప్పు కలిగిస్తోందని విమర్శించారు. ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరించడం అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తోందన్నారు.

యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని పునరుద్ఘాటించిన వల్లూరు భార్గవ్, తక్షణ ఉద్రిక్తతల తగ్గింపు, దౌత్య సంబంధాల పునరుద్ధరణ, దేశాల సార్వభౌమత్వానికి గౌరవం అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply