india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News

india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News

  • అమెరికా షాక్ ?..
  • భారత్‌కు రష్యా ఆయిల్
  • ఇండియాకు సడన్ రిలీఫ్
  • హోర్ముజ్ జలసంధి బ్లాక్..
  • ప్రపంచం విల‌విల‌..
  • భారత్‌కు ప్రత్యేక మినహాయింపు
  • ఇరాన్ దెబ్బకు ఆయిల్ మార్కెట్ కుదేలు..
  • గల్ఫ్ టెన్షన్.. పెరిగిన చమురు ధరలు..
  • భారత్‌ను ఆశ్రయించిన అమెరికా

( ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్)

india-russia-oil

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల మధ్య హోర్ముజ్ జలసంధి బ్లాక్ కావడంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్ కుదేలైంది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు రష్యా నుంచి చమురు కొనుగోలుకు 30 రోజుల మినహాయింపు ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జ‌రుపుతున్నజాయింట్ ఆప‌రేష‌న్ ఎపిక్ ప్యూరీ.. రెండ‌వ వారంలోకి అడుగు పెట్టంది.

india-russia-oil

భేష‌ర‌తుగా లొంగిపోవాల‌ని ఇరాన్ కు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్ట్ ట్రంప్ ఫ‌త్వా జారీ చేశారు. మ‌రో వైపు ఇజ్రాయెల్ జెట్‌ఖ ఫైట‌ర్లు ఇరాన్ ఆకాశంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాంబుల వ‌ర్షం కురిపిస్తుంటే.. ఇరాన్ మాత్రం చాక‌చ‌క్యంగా.. అటు అమెరికా, ఇటు ఇజ్రాయ‌ల్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. గ‌ల్ఫ్ లోని తొమ్మిది అమెరికా మిత్ర దేశాల‌కు కంటిమీద కునుకును దూరం చేసింది. ఒక వైపు త‌న సైనిక స్థావ‌రాలపై బాంబులు ప‌డుతున్నా.. వంద‌లాది మంది పౌరులు చ‌నిపోతున్నా.. ఇరాన్ ఎక్క‌డ త‌గ్గ‌టం లేదు. అన్నిటి కంటే.. అమెరికా ఆయువు ప‌ట్టు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఛిన్నాభిన్నం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మార్గాన్ని అష్ట‌దిగ్భంధ‌నం చేసింది. అంతే.. ఆసియా దేశాల‌న్నీ అల్లాడే ప‌రిస్థితి ఏర్ప‌డింది. భార‌త్ స‌హా .. జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా దేశాలు అగ‌మ్య‌గోచ‌రంలో కొట్టి మిట్టాడుతున్నాయి.

india-russia-oil

కేవ‌లం అమెరికా సృష్ఠించిన ప‌శ్చిమాసియా లో య‌ద్ధంతో . క‌డ‌కు అమెరికా చ‌మ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఈ స్థితిలో నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఆ దేశం నుంచి ఆయిల్ కొనొద్దు, ఆయిల్ కొంటే.. తాట తీస్తాం అని గ‌ర్జించిన అమెరికా.. తాజాగా.. త‌న బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌ను వెన‌క్కి తీసుకుంటోంది. అస‌లేం జ‌రిగిందంటే..

india-russia-oil : అమెరికా బేష‌ర‌తు వ‌రం

india-russia-oil

ర‌ష్యా నుంచి నెల రోజుల పాటు ముడి చ‌మురు కొనుగోలుకు భార‌త్ కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు అమెరికా ట్రెజరీ క‌మిటీ ఈ నిర్ణయం వెల్ల‌డి చేసింది. ఈ నిర్ణ‌యానికి వెనుక ప్రధానంగా ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం కోల్పోవ‌టం, వ్యూహాత్మక దౌత్య కారణాలు ఉన్నాయి.
రష్యా నుంచి భారత్ వంటి దేశాలు చమురు కొనడం అకస్మాత్తుగా ఆపేస్తే, ప్రపంచ మార్కెట్‌లో చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయి.

ఇది అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో ద్రవ్యోల్బణానికి (Inflation) దారి తీస్తుంది. దీన్ని నివారించడానికే ఈ తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. క్వాడ్ (QUAD) , ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్ అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి. రష్యా విషయంలో భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తే, అది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని అమెరికా భావిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ , పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా చమురుపై పూర్తిగా నిషేధం విధిస్తే భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడతాయి.

india-russia-oil


అమెరికా, మిత్రదేశాలు రష్యా చమురుపై ఒక ధర పరిమితిని (ఉదాహరణకు బ్యారెల్‌కు $60) విధించాయి. భారత్ ఈ పరిమితి లోపు లేదా దానికి అనుగుణంగానే కొనుగోలు చేస్తూ, రష్యాకు యుద్ధం కోసం వెళ్లే నిధుల ప్రవాహాన్ని తగ్గిస్తోందని అమెరికా సంతృప్తి వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి ముడి చమురును కొని, దానిని శుద్ధి చేసి యూరప్ , ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా ఇంధన కొరత లేకుండా చేయడంలో సహాయపడుతోంది.మొత్తానికి, రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదనే ఉద్దేశంతో అమెరికా ఈ మధ్యేమార్గం ఎంచుకుంది.

india-russia-oil : ముడిచ‌మురు దెబ్బ

india-russia-oil

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్‌కు సుమారు $90.90 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 12% పైగా పెరిగింది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర బ్యారెల్‌కు సుమారు $93.04 కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో పెరుగుదల ఉన్నప్పటికీ, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ₹94.77, డీజిల్ ₹87.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. శ‌నివారం నుంచి వంట గ్యాస్ (LPG) ధర ₹60 పెరిగింది. ఈ స్థితిలో ఆయిల్ ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని, నిత్య‌వ‌స‌ర స‌ర‌కుల ధ‌ర‌లు పెరుగుతాయ‌ని భార‌త్ లో ఆందోళ‌న నెల‌కొంది.

india-russia-oil : అమెరికా పీచే ముడ్

india-russia-oil

ఇరాన్ యుద్ధం కారణంగా ఆయిల్ సరఫరాకు ఆటంకం కలగడంతో, సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేయడానికి అమెరికా భారత్‌కు 30 రోజుల తాత్కాలిక మినహాయింపు (Waiver) ఇచ్చింది. ఇది ఏప్రిల్ 4, 2026 వరకు అమలులో ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనడానికి తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, జాతీయ ఇంధన భద్రత దృష్ట్యా కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌కు ఎంత మొత్తంలో చమురు ఎగుమతి చేస్తున్నామనే గణాంకాలను “శత్రువుల” నుంచి రక్షించుకోవడానికి బహిర్గతం చేయబోమని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
జనవరి 2026లో రష్యా చమురు వాటా 19.3% కి తగ్గినప్పటికీ, ఫిబ్రవరిలో అది తిరిగి 30% కి పెరిగింది. ప్రస్తుతం రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. తాము ఎంత మొత్తుకున్నా.. భారత్‌, ర‌ష్యా మ‌ధ్య వాణిజ్య బంధం తెగ‌ద‌ని గ్ర‌హించిన అమెరికా.. తాజాగా నెల‌రోజులు టైమ్ ఇచ్చిన‌ట్టు గొప్ప‌లు పోతోంది.

india-russia-oil : ఇదీ ఇరాన్ వ్యూహం

హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మార్గాన్ని ఇరాన్ అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై బాంబు పేల్చిన‌ట్టే. హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలక ‘చమురు నరం’. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20% నుండి 25% (రోజుకు సుమారు 2 కోట్లకు పైగా బ్యారెళ్లు) ఈ సన్నని మార్గం గుండానే వెళ్తుంది.

india-russia-oil

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), కువైట్, ఖతార్, ఇరాక్ వంటి దేశాలు త‌మ చమురును ఈ మార్గంలోనే ప్రపంచానికి అందిస్తాయి. ఈ మార్గం మూతపడితే ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్రంగా నష్టపోతాయి . చైనా: తన చమురు అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. భారతదేశం: భారత్ దిగుమతి చేసుకునే చమురులో గణనీయ భాగం ఇక్కడి నుంచే వస్తుంది.
జపాన్ , దక్షిణ కొరియా దేశాల ఇంధన అవసరాల్లో దాదాపు 80% ఈ మార్గం ద్వారానే తీరుతాయి. సరఫరా నిలిచిపోతే భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వెంటనే ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకంటే ఈ దేశాలకు సొంత చమురు నిల్వలు తక్కువ, దిగుమతులే ఎక్కువ. ధరలు లీటరుకు రూ. 150-200 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తుంది.

india-russia-oil : అమెరికాకు షాక్

india-russia-oil

ఇరాన్ చర్య పరోక్షంగా అమెరికాకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
అమెరికాలో చమురు ధరలు పెరిగితే అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత త‌ప్ప‌దు. ఇది అమెరికా ఎన్నికలు లేదా రాజకీయ స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. సరఫరా ఆగిపోతే ఆ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరుగుతుంది. చమురు వ్యాపారం డాలర్లలో జరుగుతుంది.

india-russia-oil

ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడితే ప్రత్యామ్నాయ కరెన్సీల (రూబుల్, యువాన్) వాడకం పెరిగే ప్రమాదం ఉంది, ఇది డాలర్ విలువను తగ్గిస్తుంది. అందుక‌కే ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకోవడం ద్వారా “మేము తలుచుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయగలం” అనే సంకేతాన్ని అమెరికాకు ఇచ్చింది. దిక్కులేని స్థితిలో అమెరికా ట్రెజరీ భారత్ వంటి దేశాలకు రష్యా నుంచి చమురు కొనడానికి మినహాయింపులు ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. ద‌టీజ్‌.. ఇరాన్ స్ట్రాట‌జీ.

ALSO READ : World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha Detail Report

Leave a Reply