India | పుతిన్ పర్యటన విజయవంతం..

India | పుతిన్ పర్యటన విజయవంతం..

India, న్యూఢిల్లీ ఆంధ్రప్రభ : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో ప్రధానంగా దేశరాజధాని న్యూఢిల్లీలో (New Delhi) చేపట్టిన 30 గంటల పర్యటన విజయవంతమైంది. గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీ చేరుకున్న ఆయన అదే రోజున ప్రధాని మోడీ తన అధికారిక నివాసంలో ఇచ్చిన డిన్నర్కు హాజరయ్యారు. మర్నాడు ఉదయం అంటే శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు భారత్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం రాజ్ ఘట్ కు చేరుకొని మహాత్మా గాంధీ స్మారకానికి నివాళులర్పించారు.

అనంతరం హైదరాబాద్ (Hyderabad) హౌస్ లో ప్రధాని మోడీతో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలను జరిపారు. ఇరుదేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారు 2026లో రష్యాలో జరిగే24వ భారత – రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావాల్సిందిగా మోడీని ఆయన ఆహ్వానించారు. సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు చేరుకు న్నారు. రష్యా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన డిన్నర్కు పుతిన్ హాజరయ్యారు. రాత్రి 9 గంటలకు రష్యాకు తిరుగు ముఖం పట్టారు.

మరి కొన్ని వార్తలకు లింక్ క్లిక్ చేయండి

https://epaper.prabhanews.com/

Leave a Reply