భారతదేశం, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరోసారి ఉద్రిక్త పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న మరో అధికారిని భారతదేశం బహిష్కరించింది.
ఈరోజు (బుధవారం) భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఒక సీనియర్ దౌత్యాధికారిని దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.అయితే, ఇప్పటికే మే 13న ఒక అధికారిని బహిష్కరించగా.. వారం వ్యవధిలో ఇది రెండోసారి.
భారత ప్రభుత్వం ఈరోజు (బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఒక సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన దౌత్యాధికారిని మే 13న బహిష్కరించగా.. వారంలోపు మరో అధికారిని బహిష్కరిస్తూ భారత్ ఆదేశాలు జారీ చేసింది.
ఈ అధికారి “పర్సొనా నాన్ గ్రాటా”గా (అవాంఛిత వ్యక్తిగా) ప్రకటించబడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే, ఆయన ఇకపై భారత్‌లో ఉండేందుకు అనుమతి లేదు. తన అధికారిక హోదాకు అన్వయించని పనుల్లో పాల్గొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పాక్ అధికారి 24 గంటలలోగా భారత్‌ను విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.