INDIA | జెండా ఎగరవేత..

INDIA | జెండా ఎగరవేత..
- జనవరి 26న జెండా ఆవిష్కరణకు నిబంధనలు…
- ఆగస్ట్ 15న జెండా ఎగరేయడంలో తేడాలు…
INDIA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారతదేశ గణతంత్ర దినోత్సవం గ్రూపు సోమవారం దేశంలోని, రాష్ట్రంలోని ప్రధాన అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో (School) ముస్తాబవుతున్నాయి. ఆ రోజున జెండాని ఎగురవేసేందుకు రాజ్యాంగం ప్రకారం కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రతి భారతీయ పౌరుడి గుండెను గర్వంగా ఉప్పొంగే రెండు ముఖ్యమైన రోజులు ఇవి. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. ఆగస్టు 15న మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రెండు రోజులు త్రివర్ణ పతాకానికి సంబంధించి ప్రత్యేకమైన పద్ధతులు, నియమ నిబంధనలు కలిగి ఉంటాయి. అయితే ఈ రెండు పండుగలలో జెండా ఎగరవేసే విధానం, జెండా ఆవిష్కరణ మధ్య ఉండే తేడా చాలా ఉంది అని గజట్ తెలుపుతున్నాయి.ఆ తేడాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్లాస్టిక్ జెండాలను వాడకూడదు.
INDIA | ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం…
బ్రిటిష్ పాలకుల కబంధహస్తాల నుంచి భారతదేశాన్ని పోరాటం చేసి కొన్ని వేలమంది ప్రాణ త్యాగం చేసిన తరువాత మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన రోజుగా ఈ రోజుని పురస్కరించుకుంటాం. ఈ రోజున న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. త్రివర్ణ పతాకం ఎగరవేసే విధానానికి వస్తే.. జెండా (Flag) స్తంభం దిగువ భాగంలో కడతారు. ఈ పతాకాన్ని పైకి లాగి ఆపై రెపరెపలాడించడం ద్వారా భారతదేశం స్వతంత్రమైందన్న గౌరవాన్ని తెలియజేస్తారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా అవతరించిందని గుర్తు చేసే ప్రత్యేక పద్ధతి.

INDIA | జనవరి 26న గణతంత్ర దినోత్సవం…
స్వాతంత్రం అనంతరం భారత రాజ్యాంగాన్ని కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశానికి భారత రాజ్యాంగం సుప్రీం గా ఉంటుంది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. జెండా ఆవిష్కరణ విధానానికి వస్తే, జెండాను స్తంభం పైభాగంలో ముందుగానే కడతారు. ఆపై ఆవిష్కరించబడుతుంది. ఇది దేశం ఇప్పటికే స్వతంత్ర దేశమని తెలియజేసే పద్ధతి. స్వాతంత్ర దినోత్సవం రోజున ఎవరు జెండా ఎగరవేయాలి, గణతంత్ర దినోత్సవం రోజున ఎవరు జెండా ఎగరవేయాలి అన్న అంశాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. తేడాల సంగతి గమనిద్దాం… స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఢిల్లీ (Delhi) ఎర్రకోటపై ప్రధాన మంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.

- INDIA | కార్యక్రమ స్థలం..
ఆగస్టు 15న ఎర్రకోట ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయి. జనవరి 26న రాజ్‌పథ్ వద్ద జెండా ఆవిష్కరణ జరుగుతుంది.
INDIA | జెండా ఎగరవేయుట, ఆవిష్కరణ…
ఆగస్టు 15న జెండాను స్తంభం దిగువన కట్టి, పైకి లాగి ఎగురవేస్తారు. జనవరి 26న జెండాను ముందుగానే స్తంభం పైభాగంలో కట్టి ఉంచి, ఆపై ఆవిష్కరించబడుతుంది. ఈ తేడాల వెనుక అంతర్భావం ఉందని ప్రజాప్రతినిధులు తెలుపుతున్నారు. జెండాకు మూడు రంగులు ఉంటాయి. పైన కాషాయం రంగు, మధ్యన తెలుపు, కింద ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా ఉంటుంది. కాషాయ జెండా రంగు (Colour) పైకి ఉండాలి ఆకుపచ్చ రంగు కింద ఉండే విధంగా ప్రతి ఒక్కరూ అమర్చుకోవాలి. 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. ఆ కాలంలో రాజ్యాంగాధికారి అయిన రాష్ట్రపతి పదవి లేకపోవడంతో ఆగస్టు 15 నాడు ప్రధాని జెండా ఎగురవేశారు. కానీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడంతో, గణతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా మారింది.

జెండా పండుగపై అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని రాజ్యాంగం సూచిస్తుంది. త్రివర్ణ పతాకం మన సార్వభౌమత్వానికి, ఐక్యతకు ప్రతీక. పతాకానికి సంబంధించిన ఈ తేడాలు ప్రతి భారతీయ పౌరుడికి తెలియడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా విద్యార్థులకు (Students) జాతీయ పండుగల స్ఫూర్తి తెలియజేయాల్సి ఉంటుంది. జెండా రెపరెపలాడుతున్న ప్రతి సారి, దేశభక్తి గర్వాన్ని మన గుండెల్లో నిలుపుకుందాం అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ స్వాతంత్ర దినోత్సవం రోజున మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జెండాను ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మండల స్థాయిలో మండల అధికారులు ,పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించటం ఆనవాయితీగా వస్తుంది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం. కొంతమంది రాజకీయ నాయకులూ జెండా ఎగురువేత అంశాన్ని గ్రామస్థాయిలో పలు ఆటంకాలు కలుగజేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన మండల స్థాయిలో అధికారులు, పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర దినోత్సవం రోజున మండల స్థాయిలోను, గ్రామస్థాయిలోనూ ఎంపీపీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు,(MLA) ప్రజాప్రతినిధులు జెండాను ఆవిష్కరించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. నిబంధనల మేరకే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.
జెండాను తొక్క కూడదు, దానిపై ఎలాంటి రాతలు రాయకూడదు. జెండా మధ్యలో అశోక్ ని ధర్మచక్రం ఉంటుంది. జెండా పాతదైన తర్వాత దాన్ని కాల్చివేయాలి తప్ప ఇలాంటి చెత్తబుట్టలో నువ్వు వేయకూడదు అలా చేస్తే పది సంవత్సరాలు కఠిన గారాగాల శిక్ష అని చట్టం చెబుతుంది. నిబంధనలన్నీ పాటించాల్సి ఉంటుంది.
