Jannaram | ఇందనపల్లి రేంజర్ శ్రీనివాస్ బదిలీ

నూతన రేంజ్ ఆఫీసర్ నియామకం
జన్నారం, జూన్ 26 (ఆంధ్రప్రభ) : ఎట్టకేలకు 8నెలల11 రోజులకే రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ (Karam Srinivas) ను బదిలీ చేసి, నూతన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను నియమించారు. మంచిర్యాల (Mancherial) జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ను ఎట్టకేలకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో రేంజ్ ఆఫీసరుగా పదోన్నతి పొందిన జి.శ్రీధరచారి (Sridharachari) ని నియమిస్తూ రాష్ట్ర ప్రధాన అటవీ శాఖ ఇన్చార్జి అధికారిణి సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం బదిలీ అయిన‌ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ జిల్లా ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ రేంజర్ (Forest Task Force Ranger) గా వ్యవహరిస్తూ ఇన్చార్జిగా ఇందనపల్లికి 2024 అక్టోబర్ 14న వచ్చారు. 8నెలల 11రోజులకు అనతి కాలంలోనే బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అడవుల్లోని అక్రమ కలప, ఇసుక రవాణాను తనదైన శైలిలో అరికట్టగలిగారు. నూతనంగా నియమించిన రేంజ్ ఆఫీసర్ శ్రీధరచారి త్వరలో బాధ్యతలు తీసుకొనున్నారు.

Leave a Reply