లండన్ : ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. రెండో రోజు ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌట్ అవ్వగా… ప్రత్యుత్తరంగా బరిలోకి దిగిన భారత్ 145/3తో నిలిచింది. దీంతో టీమిండియా ఇంకా 242 పరుగులు వెనుకంజలో ఉంది.
రెండో రోజు ఉదయం అందరి దృష్టి జో రూట్‌పై నిలిచింది. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ ను కొనసాగుతున్న రూట్, ఆరంభ బంతికే బౌండరీ కొట్టి తన 37వ టెస్ట్ శతకం పూర్తి చేసుకున్నాడు.
అయితే, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన సత్తా చాటాడు. రెండో కొత్త బంతితో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను 44 పరుగుల వద్ద బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అదే రెండు బంతుల్లో రూట్ (100) మరియు క్రిస్ వోక్స్ (0)లను అవుట్ చేశాడు.
ఆ తర్వాత భారత్‌కి మరో బ్రేక్‌త్రూ దక్కేదే కానీ, కేఎల్ రాహుల్ జేమీ స్మిత్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను చేజార్చాడు. ఆ తప్పిదం భారమయ్యింది. స్మిత్ ఆత్మస్థైర్యంతో ఆడి 51 పరుగులు చేయగా, మళ్లీ మ్యాచ్ భారత్ చేతుల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది.
సాయంత్రం సెషన్లో భారత్ బౌలర్లు మరోసారి ఆధిపత్యం చూపించారు. సిరాజ్ జేమీ స్మిత్, కార్సేలను ఔట్ చేయగా, టేయిల్ లెండ్ వికెట్లు బుమ్రానే తీసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ప్రత్యుత్తరంగా బరిలోకి దిగిన భారత్
భారత్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు కొట్టి యశస్వి జైస్వాల్ జోరు చూపించాడు. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత టెస్టులకు తిరిగి వచ్చిన జోఫ్రా ఆర్చర్ తన తొలి ఓవర్లోనే జైస్వాల్ (13)ను పెవిలియన్‌కు పంపి ఇంగ్లాండ్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు.
కేఎల్ రాహుల్ – కరుణ్ నాయర్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ స్థిరత చూపించారు. కానీ టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ కీలకంగా నాయర్ (40) ను ఔట్ చేయడంతో జోడీ విరిగింది. ఫస్ట్ స్లిప్‌లో జో రూట్ అందుకున్న వన్ హ్యాండెడ్ క్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.
కెఎల్ రాహుల్ – కరుణ్ నాయర్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. కానీ టీ విరామం తర్వాత, ఈ జోడీని విడదీస్తూ… బెన్ స్టోక్స్ బౌలింగ్ లో నాయర్ (40) ను అవుట్ చేశాడు. మొదటి స్లిప్‌లో జో రూట్ ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఆ తరువాత వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కాస్త స్థిరపడతాడనగా, క్రిస్ వోక్స్ అతన్ని 16 పరుగులకే వెనక్కు పంపాడు. ఒక వైపు కేఎల్ రాహుల్ 53* పరుగులు చేసి నిలువగా, రిషబ్ పంత్ 19* తో ధైర్యంగా ఎదురొంటున్నాడు.
ప్రస్తుతం రాహుల్ – పంత్ జోడీ క్రీజులో నిలవగలిగితే భారత్ మ్యాచ్‌ను సమతూక స్థితికి తీసుకువెళ్ళగలదని ఆశాభావం వ్యక్తమవుతోంది. కాబట్టి, రాహుల్-పంత్ జంట క్రీజులో తమను తాము నిలబెట్టుకోగలిగితే, భారత్ భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.