Day 3 Lunch : ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ (IND vs ENG lord’s test) తొలి ఇన్నింగ్స్ (డే 3) ను 145/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన భారత్.. మంచి ఆరంభం అందుకుంది. నిన్నటి ఇన్నింగ్స్ కొనసాగించిన కేఎల్ రాహుల్ – రిషబ్ పంత్ తొలి సెషన్లో చక్కటి భాగస్వామ్యం (Partnership) కుదుర్చారు. నిలకడగా ఆడుతూ.. అద్భుతమైన డిఫెన్స్ తో పాటు లూజ్ డెలివరీలను సద్వినియోగం చేసుకుంటూ స్కోరు ముందుకు తీసుకెళ్ళారు.
రాహుల్ – పంత్ కలిసి 4వ వికెట్‌కి 198 బంతుల్లో 141 పరుగులు జోడించారు. దీంతో డే 3 లంచ్ సమయానికి భారత్ స్కోరు 65.3 ఓవర్లలో 248 పరుగులుకి చేరింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరుకి భారత్ ఇంకా 139 పరుగులు వెనుక ఉంది.
బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది పంత్ 86 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, రాహుల్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో, లంచ్ కు ముందు చివరి ఓవర్ లో క్విక్ సింగిల్ కోసం ప్రయత్నింగా.. కానీ అది విఫలమయ్యింది. దీంతో కీలక సమయంలో కేఎల్‌కి మంచి తోడుగా నిలిచిన పంత్ 74 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం క్రీజులో రాహుల్ 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు మిగతా బ్యాటర్లు రాహుల్‌కి తోడుగా నిలిచి జట్టును ఇంగ్లాండ్ స్కోర్‌కి దగ్గరకి తీసుకెళతారా అన్నది చూడాలి.
