ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మూడో రోజు పోస్టు లంచ్ సెషన్‌లో భారత్ పుంజుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుత శతకం నమోదు చేసి జట్టును వేగంగా ముందుకు న‌డిపిస్తున్నాడు. అతను 127 బంతుల్లో తన ఆరవ టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు బలమైన ఆధారం అందించాడు. దీంతో మూడో రోజు ఉదయం 75/2తో ఆటను కొనసాగించిన భారత్, 51 ఓవర్లలో 216/4 వద్ద నిలిచి, లీడ్‌ను 200కి పైగా పెంచేసింది.

అంత‌క‌ముందు జైస్వాల్ తో పాటు మూడో రోజు ను ప్రారంభించిన ఆకాశ్ దీప్ తన టెస్ట్ కెరీర్‌లో తొలి అర్ధశతకం పూర్తి చేశాడు. 94 బంతుల్లో 66 పరుగులు చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Leave a Reply