ఆంధ్రప్రభ : బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో భారత్–ఆస్ట్రేలియా (ind vs aus) మధ్య జరగాల్సిన ఐదవ నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ వర్షం (t20 match today) కారణంగా రద్దయింది (No Result). దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (23* పరుగులు, 13 బంతుల్లో) – శుభ్‌మన్ గిల్ (29* పరుగులు, 16 బంతుల్లో) సిరీస్‌ను గెలుచుకోవాలనే పట్టుదలతో దూకుడుగా ఆడారు. వీరి విజృంభణతో కేవలం 4.5 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేరింది.
ఈ జోరు కొనసాగుతున్న తరుణంలో, భారీ వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. రెండు గంటలకు పైగా ఎదురుచూసిన తర్వాత, అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఈ సిరీస్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అభిషేక్ శర్మ 163 పరుగులు (స్ట్రైక్‌రేట్ 161.38) సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు. అతని అత్యధిక స్కోరు 68 పరుగులు.
సిరీస్ ఫలితాలు:
- 1వ టీ20: వర్షం కారణంగా రద్దు
- 2వ టీ20: ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం
- 3వ టీ20: భారత్ 5 వికెట్లతో గెలుపు
- 4వ టీ20: భారత్ విజయంతో ఆధిక్యం సాధించింది
- 5వ టీ20: వర్షం కారణంగా రద్దు
ఈ సిరీస్ గెలుపు వచ్చే ఏడాది జరగబోయే ICC టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.


