జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా..

జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా..
ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ(Padma Shri Mandakrishna) మాదిగను జిల్లా ఎంఈఎఫ్ నాయకులు ఈ రోజు స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద కలిసి ఉద్యమ వివరాలను తెలియజేశారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా హైదరాబాదులో జరిగే మహా ప్రదర్శనలో ఎంఈఎఫ్(MEF) ఉద్యోగులు భాగస్వాములు కావాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎంఈఎఫ్ నాయకులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గురుప్రసాద్, ఎంఈఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తేళ్ళపుట్ట జమలయ్య, ఎం ఈ ఎఫ్ సీనియర్ నాయకుడు మడిపల్లి బాబు(Madipalli Babu), ఎం ఈ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేళ్లచెరువు బాబు, జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి మురళి, జిల్లా కార్యదర్శి కారుమంచి దయాకర్, సీనియర్ నాయకులు వెల్లంకి జైపాల్, దూది జయరాజ్, దారెల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
