పోలీస్ అమరవీరుల స్మారకార్థం
కోరుట్ల టౌన్ (ఆంధ్ర ప్రభ): కోరుట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా మెటపల్లి డిఎస్పీ అడ్డూరి రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణగా ఉండి సేవలు అందిస్తారని, దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడుతున్నారని, వారి త్యాగాలను కొనియాడారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో పరిధిలో వారి త్యాగాలకు చిహ్నంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు, సామాజిక కార్యకర్తల, ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ మంద చిరంజీవి రక్తదానం చేశారు. మండల పట్టణ యువత నుంచి సేకరించినటువంటి రక్త నిల్వలను బ్లడ్ బ్యాంకు అందజేశారు. అత్యవసర సమయాల్లో పేదలకు రక్తం అవసరం ఉన్న వారికి వినియోగించుకోవచ్చని వారు తెలిపారు. రక్తదాన అనుసంధానకర్తలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు ఎన్. రాజు, పాల్గొన్నారు. పోలీస్ ఏ ఎస్ ఐ అలీం, హెడ్ కానిస్టేబుల్ లు తిరుపతి, ఎల్లయ్య, సురేష్, గట్టు శ్రీనివాస్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

