జ్ఞాపకార్ధం.. రక్తదాన శిబిరం..
చిట్యాల, (ఆంధ్రప్రభ)
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామానికి చెందిన రుద్రారపు చందు ఇటీవల మరణించాడు. శనివారం నాడు SSC 2016-17 మిత్రులు అందరూ కలిసి రుద్రారపు చందు జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 20 మందికి పైగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చందు మిత్రులు మాట్లాడుతూ.. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు. కాగా నల్గొండ పట్టణంలో గల అపర్ణ బ్లడ్ బ్యాంక్ అండ్ స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో దాదాపు 20 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్ముకుంట్ల సాయికుమార్, రుద్రారం సాయికుమార్, వరుకుప్పల నవీన్, మెట్టు రాము, ఆవుల శివ, రూపని గణేష్, రూపని పవన్, మాలిగ కిరణ్, రేగులగడ్డ శివ, వినయ్, భాస్కర్, నరేష్ మరియు గ్రామ పెద్దలు, యువజన సంఘాలు పాల్గొన్నారు.

