కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : బంధంగా పుట్టని ఈ స్నేహం అనుబంధంగా కడ దాకా ఉండును కదా.. ఏ సంబంధం లేని ఓ స్నేహితుడి జ్ఞాపకార్థం మిత్రులందరూ కలసి ఓ సేవాభావం కార్యక్రమం చేపట్టి గ్రామస్థులతో ప్రశంసాలు పొందారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి కి చెందిన సుంకేట రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
స్నేహితుడి జ్ఞాపకార్థం రవి స్నేహితులు కమ్మర్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థినులకు పుస్తకాలు, పెన్నులను, పండ్లను ఈ రోజు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరణించిన స్నేహితుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల సాయి రెడ్డి, జైడి బాలకృష్ణ, కొమ్ముల మైపాల్, బద్దం రాజేష్, జడల జితేందర్, జడల మణికంఠ, అఖిల్, రోహిత్, స్వామి పాల్గొన్నారు.