అవ‌స‌ర‌మైన చోట త‌క్ష‌ణ సాయం..

అవ‌స‌ర‌మైన చోట త‌క్ష‌ణ సాయం..

ఖమ్మం బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఖమ్మం నగరంలో వరద ముప్పు ప్రాంతాలను వ్యక్తిగతంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ప్రజల భద్రత, రక్షణ కార్యక్రమాలు, సహాయక చర్యలపై అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని నదీ తీర ప్రాంతాలు, లోతట్టు బస్తీలు, డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్డు పరిస్థితులు, జల నిల్వ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు కట్టుబడి ఉందని, వర్షాలు కొనసాగుతున్న నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో స్పందించే కంట్రోల్ రూమ్‌ల(Control Room)ను మరింత చురుకుగా నిర్వహించాలని, బృందాలు రెడీనెస్‌Readiness)లో ఉండాలని, ప్రమాద ప్రాంతాల్లో తగిన విధంగా హెచ్చరికలు, రక్షణ ఏర్పాట్లు చేయాలని అన్నారు.

అవసరమైన చోట తక్షణ సాయం అందించేందుకు ఎన్డిఆర్ఎఫ్, మున్సిపల్(NDRF, Municipal), పోలీస్ విభాగాలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. వరద కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శిస్తూ, ప్రభుత్వం పూర్తిగా వారి పక్కన ఉందని పౌరులకు ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శఅనుదీప్ , ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అధికారులు వెంటనే నివేదికలు సమర్పించి, అవసరమైన చోట పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

Leave a Reply