వైద్యుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి..

నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని క్రేయాన్ హాస్పిటల్‌లో బాలల వైద్యుడు డాక్టర్ అభిషేక్‌పై జరిగిన భౌతిక దాడికి నిరసనగా రాష్ట్ర ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ ఐఎంఏ వైద్యులు శనివారం డాక్టర్స్ లేన్‌లో ధర్నా నిర్వహించారు.

వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన వారు, దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, డాక్టర్ అపాల చక్రధారి, డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ రమేష్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కృష్ణంరాజు, డాక్టర్ పోలిశెట్టి సంతోష్, డాక్టర్ రమణ గౌడ్, డాక్టర్ సుచిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply