రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక

రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక

అన్ని మతాలు, కులాలు కలిసి సహాజీవనం చేయడం భారతదేశ గొప్పతనం
ఒకరి మతాన్ని, కులాన్ని ఎప్పుడు కించపర్చవద్దు
మతాలు, కులాలు వేరైనా మనమంతా భారతీయులం
కుల మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు
అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి
ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను చదివించండి
మీకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నాడని గుర్తుంచుకోండి
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : భారతదేశంలో భిన్న మతాలు, కులాలు ఉన్నప్పటికీ సోదర భావంతో కలిసిమెలిసి జీవించడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ఫలితమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్క రించు కొని స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలోని శివునిపల్లి కే.ఆర్ గార్డెన్స్‌లో ఏర్పా టు చేసిన దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండుగ ఆత్మీయతకు, మత సమరస్యానికి ప్రతీక అని తెలిపారు.

సమాజంలో సోదర భావాన్ని పెంపొందించే గొప్ప పండుగగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతదేశం గొప్ప సంస్కృతి, ప్రజాస్వా మ్య విలువలు కలిగిన దేశమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత అని అన్నారు. మతాలు, కులాలు వేరైనా మనమంతా భారతీయులమేనని స్పష్టం చేశారు. ఇటీవల కొంతమంది మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభాలు పొందాలని చూస్తు న్నారన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవడం అవసరమన్నారు.

రెండవ విడతలో ఇండ్లు లేని పేద ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తా:

ఇండ్లు లేని పేద ముస్లింలకు రెండవ విడతలో ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే కడియం చెప్పారు. నియోజకవర్గంలో ముస్లిం సోదరుల కోసం ప్రతి సంవత్సరం ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నామని తెలిపా రు. ఖాబరస్థాన్‌లలో ప్రహరీ గోడలు, బోర్‌వెల్స్ వంటి సదుపాయాలకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగా ణలోనే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, వాటి ద్వారా నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలను చదివించాలని కోరారు.

ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బం దులు వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు. చివరిగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, మున్సిప ల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతిని ధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply