సహజంగా తగ్గండిలా..
మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తిండి-నిద్ర వేళలు ఏవీ సరైన వేళకు జరగడం లేదు…కారణాలు అనేకం…ఐటీ ఉద్యోగాలు, లేదా రాత్రుళ్ళు చదువుకోవడాలూ-చాటింగ్ లు… జంక్ ఫుడ్…వీటి వల్ల సహజంగా మన శరీరంలో కలిగే మార్పు- ఒబేసిటీ…బరువు పెరిగిపోవడం.
పెరిగిపోతున్నామని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదీ అవాయిడ్ చేయలేని పరిస్థితి. పరిస్థితి చేయి దాటిపోయాక, అసహజ పాద్దతుల్లో బరువు తగ్గించుకోవాలని చేసే ప్రయత్నాల్లో భాగమే డైటింగులు-సర్జరీలు.
రెండూ ప్రమాదాలే. సరైన మారగమేమిటంటే, సహజంగా బరువు తగ్గించుకోవడమే. అందులో ప్రధానమైనది, బరువు తగ్గడానికి ఉపయోగపడే ఫుడ్ తీసుకోవడం.
బరువు తగ్గడం అంటే ఫుడ్ మానేయడం కాదు — సరైన ఆహారం ఎంచుకోవడం. మనం తినే పదార్థాలే మన ఆరోగ్యాన్ని, బరువును నియంత్రిస్తాయి. సహజంగా బరువు తగ్గాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ, అదనపు కొవ్వు తగ్గించే ఆహారం తీసుకోవాలి.
అవేమిటో ఇప్పుడు చూద్దాం.
తినాల్సిన ఫుడ్స్
- ఓట్స్.
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట నిండిన భావన ఎక్కువసేపు ఇస్తుంది. ఉదయాన్నే ఓట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే రోజంతా తేలికగా ఉంటుంది. - ఆకుకూరలు:
పాలకూర, కూరగాయలు, మెంతి ఆకులు వంటి ఆకుకూరలు తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలు ఇస్తాయి. ఫ్యాట్ తగ్గడంలో సహాయపడతాయి. - ఫ్రూట్స్:
ఆపిల్, పపాయ, ఆరంజ్, మెలన్ లాంటి పండ్లు నీరు మరియు ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి సహజమైన తీపి తృప్తి ఇస్తాయి, కాబట్టి స్వీట్స్ తినాలనిపించదు. - గ్రీన్ టీ:
రోజుకు 1–2 కప్పులు గ్రీన్ టీ తాగితే మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది. - పెరుగు & మజ్జిగ:
పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధ్యాహ్నం తినడం వల్ల కడుపు కాంతిగా ఉంటుంది. - ప్రోటీన్ ఫుడ్:
గుడ్లు, పప్పులు, సోయా, పెసలు వంటి ఆహారం శరీరానికి బలం ఇస్తుంది, మరియు పొట్ట నిండిన భావన ఇస్తుంది కాబట్టి ఎక్కువ తినకుండా కంట్రోల్ అవుతారు. - లెమన్ వాటర్:
ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే టాక్సిన్స్ బయటకు వెళ్తాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. - డ్రైఫ్రూట్స్:
బాదం, ఆక్రోట్ వంటి డ్రైఫ్రూట్స్ తినడం వల్ల మంచి కొవ్వులు అందుతాయి, ఇవి గుండె ఆరోగ్యానికికి కూడా మంచివి.
తప్పించుకోవాల్సినవి
తీసుకోకూడనివి (పకోడీలు, సమోసాలు)
బేకరీ ఫుడ్స్ (కేకులు, పఫ్‌లు, బిస్కెట్లు)
సోడా, కోల్డ్ డ్రింక్స్
అధిక చక్కెర, స్వీట్స్
కొన్ని చిన్న చిన్న చిట్కాలు.:
రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి.
రాత్రి తేలికపాటి భోజనం చేయాలి.
ప్రతిరోజూ 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా తప్పక చేయాలి.
ఆకలిగా లేకపోయినా సమయానికి తినాలి — ఆలస్యంగా తినడం వల్ల ఫ్యాట్ స్టోర్ అవుతుంది.
“తక్కువ తినడం కాదు, సరైనదే తినడం” అనేది సహజ బరువు తగ్గడంలో ఉన్న్న అసలు మంత్రం.
(ఈ సూచనలు కేవలం ప్రాధమిక అవగాహన కొరకు మాత్రమే. సమస్య తీవ్రమనుకున్నప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించడం మంచిది.)