కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి

( కర్నూలు, ఆంధ్రప్రభ ప్రతినిధి)

కర్నూలు జిల్లా, చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన లో మరణించిన గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదం జరిగిన బస్సు లో హైదరాబాద్ ఆరంఘడ్ చౌరస్తా లో ఎక్కినట్లు తెలిసిందని, ఇతని వివరాలు తెలిస్తే కంట్రోల్ రూమ్ నెంబర్ 08518 277305 కు ఫోన్ చేసి సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.. ఇతని పేరు బస్సు ప్రయాణీకుల జాబితా లో లేదని కలెక్టర్ తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఇతని మృతదేహం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉందని, ఇతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08518-277305 కు ఫోన్ చేసి సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..

Leave a Reply