నర్సింహులపేట, ఆగస్టు20(ఆంధ్రప్రభ): రైతులందరికీ తగినంత యూరియా అందించకపోతే ఉద్యమం చేపడుతామని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండల బీఆర్ఎస్ (BRS) పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అన్నం పెట్టే రైతన్నలను హరిగోస పెడుతుందని ప్రజల ఉసురు మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు క్యూలైన్ లో చెప్పులు పెట్టే పరిస్థితి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సహకార సంఘాల చైర్మన్ (cooperative societies Chairman) లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం విడ్డూరన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ నేతలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు తదితర నాయకులున్నారు.