విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే..

విద్యార్థులు ఒత్తిడిని జయించాలంటే..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 25 బుధవారం నుండి మార్చి నెల 18 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలని, ఆందోళన ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో గట్టి నమ్మకంతో తమ ప్రతిభను నిరూపించుకునే చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, ఉమ్మడి గుండాల ఆళ్లపల్లి మండలాల విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగిందని భద్రాద్రి జిల్లా సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, స్థానిక మాజీ వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడిని జయిస్తే విజయం ఖాయమని, మీ ప్రతిభ మేధోశక్తిని నిరూపించుకోవడానికి చక్కని అవకాశం అని ఎలాంటి ఆందోళన భయం ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చిత్తశుద్ధితో విద్య పై గట్టి నమ్మకంతో పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని క్రమశిక్షణతో ఏకాగ్రతతో పరీక్షలు రాసి తల్లిదండ్రులకు గురువులకు గ్రామానికి మండలానికి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తు లక్ష్యాలను ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రశ్నలు తెలిసినవే వస్తాయని, కంగారుపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ముందుగా ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలని, తెలిసిన జవాబులను ముందుగానే రాయాలని, తదుపరి మిగతా వాటి గురించి ఆలోచించాలన్నారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు సంసిద్ధత కావాలని, పరీక్ష రాసే ముందు తగినంతగా త్రాగునీరు తీసుకోవాలని, ప్రశాంతంగా ఉత్తిడిన జయిస్తునే ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ఆళ్లపల్లి కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ సరోజినీ పాఠశాల నుండి ప్రథమ సంవత్సరం 27, ద్వితీయ 31 మొత్తంగా 58 మంది, అలాగే మర్కోడు గ్రామంలో అక్షర ఒకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ కిసరి రమేష్ పాఠశాల్లోని ప్రథమ సంవత్సరం 8 ద్వితీయ సంవత్సరం 12 మొత్తంగా 20 మంది విద్యార్థినీ విద్యార్థులు 78 మంది గాను ఉత్తీర్ణతే లక్ష్యంగా పరీక్షలు రాసి విక్టరీ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఎల్లయ్య పేర్కొన్నారు.
