శ్రీరామ హోమం.. చేస్తే..

శ్రీరామ హోమం.. చేస్తే..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం నిర్వహించిన మూల మంత్ర శ్రీరామ హోమం వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు. 34 డివిజన్ శివనగర్ సీతారామచంద్ర దేవాలయంలో హోమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పూజారులు హోమం విశిష్టత వివరిస్తూ.. ఈ హోమం రాముల వారి అనుగ్రహం కొరకు.. వారి అనుగ్రహం వల్ల మంచి కుటుంబం, సఖ్యత, మంచి మనసు, శత్రు స్థంభన, విద్య వినయం, ఏ పనినైనా చేయగలిగే శక్తి కలుగుతుందనీ నూతన సంవత్సర చైత్రమాసంలో వసంత నవరాత్రులు ప్రారంభం స్వామి వారికి కళ్యాణం (వివాహం) జరుగుతుంది. నూతన సంవత్సరం కళ్యాణంతో ప్రారంభిస్తే.. సంవత్సరం అంతా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హోమంలో అధ్యక్షులు వడ్నాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి, మంచాల కృష్ణమూర్తి దంపతులు, వడ్నాల సదానందం దంపతులు, శ్రీరాం రాజేష్ దంపతులు ఇతర భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply