అవసరమైతే ఉద్యమం చేపడతాం…
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కేంద్రంలో వైద్యసేవల కొరతపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన(A half-naked show) నిర్వహించారు. పట్టణంలోని పళ్ళ హనుమాన్ మందిరం నుంచి సెంటర్ చౌక్, వీరసౌవర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు ప్రదర్శన సాగింది.
జిల్లా ప్రజలు సరైన వైద్య వసతుల లేమితో ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకుడు నాగురావు నామాజీ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటలో ప్రభుత్వ ఆస్పత్రి(Govt Hospital in Narayanapet) ఏర్పాటుకు పార్టీ తరఫున ఎన్నిసార్లు పోరాటాలు చేసినా పాలకులు స్పందించలేదని విమర్శించారు.
ప్రదర్శనలో పాల్గొన్న కార్యకర్తలు “జిల్లాకు ఆస్పత్రి కావాలి!”, “ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దు!”, “మాతా-శిశు ఆస్పత్రి వెంటనే నిర్మించాలి(mother-child hospital should be constructed immediately)!” అంటూ నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా ఏర్పడి ఏడేళ్లు గడిచినా ప్రజలకు తగిన వైద్య వసతులు అందుబాటులో లేవని, ప్రభుత్వ ఆస్పత్రి లేకపోవడంతో చిన్న చిన్న వ్యాధులకే ప్రజలు మహబూబ్‌నగర్ లేదా హైదరాబాద్ ఆసుపత్రులకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యసేవల కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.“ప్రజల ఆరోగ్యం కోసం(health of the people) ఈ పోరాటం కేవలం బీజేపీది కాదు — ఇది నారాయణపేట ప్రజలది. ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమయ్యే వరకు మేము నిద్రపోము,” అని సత్యాయాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోషల్ వినోద్, సత్యరఘుపాల్, గోపాల్ రావు, గోపాల్, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

