ఉమ్మడి మెదక్ బ్యూరో : భారీ వర్షాలు, వరదతో సగం తెలంగాణ ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy) జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని మూసీ సుందరీకరణ, స్పోర్ట్స్ మీద రీవ్యూలు చేసుకుని కాలం గడిపారు తప్పా, సహాయక చర్యలు ముమ్మరం చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు (HarishRao) అన్నారు. ఈ రోజులు వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
మెదక్ లో వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన అనంతరం మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. హెలికాప్టర్లు సకాలంలో పంపి ఉంటే బూరుగుపల్లి (Burugupalli) లో ఇద్దరి ప్రాణాలు పోయేవి కావు అని అన్నారు. పెళ్లిళ్లకు హెలికాప్టర్లు (Helicopter) వాడుతారు కానీ, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్లు వాడరా? అని ప్రశ్నించారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.