ఎన్నికలకు విఘాతం కల్పిస్తే… చర్యలు తప్పవు – ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య

కొత్తూరు, ఆంధ్రప్రభ : మండలంలో జరగబోయే రెండవ సాధారణ ఎన్నికలకు ఎవరైనా విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తే, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తూరు ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య హెచ్చరించారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్, మల్లాపూర్ తండా, గూడూరు, రాగ్యతండా, మక్తగూడ, పెద్దగుట్టతండా గ్రామాల్లో బుధవారం ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఆర్ముడ్‌ ఫోర్స్‌తో కలిసి ఫుట్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలతో మాట్లాడి, భయపడకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఫుట్ మార్చ్‌లో ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఆర్ముడ్‌ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply