భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని నిస్వార్థంగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్న మారి పెద్దిమీనా గణేష్ అన్నారు. గురువారం రాత్రి భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పల్లికొండ సర్పంచ్‌గా గెలిపించి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నికల అధికారులు తనకు కేటాయించిన ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. మహిళలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తానని వివరించారు.
మహిళగా ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచిన తానని తెలిపారు. మహిళల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రచార కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

