ఎవరన్నాఅమ్మితే చెప్పండి

ఎవరన్నాఅమ్మితే చెప్పండి

  • జీఎస్టీతో ప్రయోజనం మనకే
  • కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి

కర్నూలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : జీఎస్టీ(GST) పన్నుల సవరణతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ధరలు తగ్గడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి(Dr. Siri) అన్నారు. కర్నూలు రెవిన్యూ డివిజన్‌లోని కల్లూరు మండలం లక్ష్మీపురం(Lakshmipuram) గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జీఎస్టీ పన్నుల తగ్గింపు పై రైతులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాక్టర్లు, వ్యవసాయ ఉపకరణాలపై జీఎస్టీ పన్నుల తగ్గింపుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర(Central, State) ప్రభుత్వాల ఆధ్వర్యంలో అన్నివర్గాలకు ప్రయోజనం కల్గించే విధంగా జీఎస్టీ పన్నుల తగ్గింపు జరిగిందన్నారు. అందులో భాగంగా ప్రజలకు జీఎస్టీ పన్నుల తగ్గింపుపై అవగాహన కల్పిస్తున్నారు.

నిత్యావసర సరుకులతో పాటు వ్యవసాయ పరికరాలు, కార్లు, బైక్, ట్రాక్టర్(Cars, Bike, Tractor)ల మీద కూడా జీఎస్టీ పన్నులు తగ్గాయన్నారు. దుకాణదారులు పాత రేట్లకు అమ్మితే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి జీఎస్టీ పన్నుతగ్గించడంతో ప్రతి నెల కుటుంబానికి 1000 రూపాయలు ఆదా అవుతుందన్నారు.

షాపింగ్ కి వెళ్ళిన సమయంలో వస్తువులు పాత రేట్లకు అమ్ముతున్నారా? కొత్త రేట్లకు అమ్ముతున్నారా? అనే విషయాన్ని పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు.. హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) మీద కూడా జీఎస్టీ పన్నుతగ్గించారని కాబట్టి ప్రజలందరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులు వారి పొలాలలో మొత్తం ఒకటే పంట వేయకుండా వేరువేరు పంటలు వెయ్యాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా రైతులు పంట మార్పిడి చేసుకోవాలని, ఒకటే పంట వేయకుండా రెండు, మూడు రకాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.

అదే విధంగా పురుగుమందులు ఎక్కువగా వాడకుండా సహజ వ్యవసాయం చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. లైవ్ స్టాక్ మిషన్(Live Stock Mission) కింద లోన్లు తీసుకొని పాడి పశువులను పెంచుకొని ఆదాయం మరింత పెంచుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని, పిల్లలను చదివించాలని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. బ్రిడ్జి నిర్మించాలని, డ్రెయిన్లు(Drains) శుభ్రం చేయించాలని, తదితర సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకుని వచ్చారని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత(Gauru Charita) మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు వారీ ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ పన్నులు తగ్గించాయని తెలిపారు..ఈ సంస్కరణల వల్ల ప్రజలకు చాలా ఆదా అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో జీఎస్టీ పన్నుల తగ్గింపుపై ఏర్పాటుచేసిన వ్యవసాయ పరికరాల ప్రదర్శనా స్టాళ్లను(Stalls) కలెక్టర్, ఎమ్మెల్యే తిలకించారు.

కార్యక్రమంలో, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాస్, కల్లూరి ఏవో విష్ణువర్ధన్ రెడ్డి.. కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply