IDOL | అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం

IDOL | అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం

IDOL | బాల్కొండ, ఆంధ్రప్రభ : బాల్కొండ మండల కేంద్రంలో గల శ్రీ మణికంఠ (Sri Manikanta) సన్నిధానంలో బుధవారం అయ్యప్ప స్వామి విగ్రహానికి అయ్యప్ప మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మెడికల్ నరేందర్, కోటగిరి రమేష్, అంబటి నవీన్, పిల్లేండ్ల శ్రీకర్, రవీన్ ప్రసాద్, రంగంపేట యాదగిరి, కోటగిరి రాజు, కన్నె స్వాములు, కత్తి స్వాములు ఘంటస్వాములు, గద స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply