Iconstar | కావాలనే టార్గెట్ చేశారా..?

Iconstar | కావాలనే టార్గెట్ చేశారా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవడానికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 42 కండీషన్స్ పెట్టారట. ఆయన కళ్లలోకి డైరెక్ట్ గా చూడకూడదట. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదట. ఇలా రకరకాల కండీషన్స్ పెట్టారనే వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఒక పాడ్ కాస్ట్ లో చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పం అయ్యాయి. దీని పై అల్లు అర్జున్ (Allu Arjun) టీమ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇదంతా కావాలనే.. బన్నీని టార్గెట్ చేయడం కోసం ఇలా చేశారా..? అసలు ఏం జరిగింది..? బన్నీ టీమ్ సీరియస్ గా ఏం చేయబోతుంది..?

Iconstar

ఒక పాడ్ కాస్ట్ లో.. కావేరి బారువా అనే ఒక బ్రాండ్ స్ట్రాటజర్ మాట్లాడుతూ.. బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని.. వింత వింత రూల్స్ పెట్టారని చెప్పడం వైరల్ అయ్యింది. ఆతర్వాత వివాదస్పదం అయ్యింది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే.. సోషల్ మీడియాలో (Media) బన్నీకి సపోర్ట్ చేసే వర్గం, బన్నీని విమర్శించే వర్గంగా విడిపోయి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇది బన్నీ దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారం పై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది అల్లు అర్జున్ టీమ్.
ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది.

Iconstar

కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీమ్ పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను స్ప్రెడ్ చేసే వారి పై లీగల్ (Legal) యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పాడ్ కాస్ట్ లో ఇలా మాట్లాడిన తర్వాత తన రీల్ వైరల్ అయినందుకు ఆమె సంతోషంగా పెట్టిన పోస్టును బట్టి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని క్లియర్ గా అర్థమౌతుంది. అయితే.. ఆమెకు లీగల్ నోటీసులు వెళ్లిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో..? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో..? ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

CLICK HERE TO READ  ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు..

CLICK HERE TO READ MORE

Leave a Reply