Icon Star | బాలీవుడ్ స్టార్స్ ను దింపుతున్న అట్లీ..

Icon Star | బాలీవుడ్ స్టార్స్ ను దింపుతున్న అట్లీ..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి మేకర్స్ (Makers) ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అయితే.. దీనికి సంబంధించి ఓ చిన్న అప్ డేట్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు..? ఈ క్రేజీ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Icon Star

Icon Star | సరికొత్త కథాంశంతో..

ఈ క్రేజీ మూవీ స్టోరీ ఏంటి అనేది మేకర్స్ చెప్పలేదు కానీ.. ఇంత వరకు తెర పై రాని సరికొత్త కథతో రూపొందుతుంది అనేది మాత్రం వాస్తవం. అందుకనే బన్నీ.. త్రివిక్రమ్ (Trivikram) ప్రాజెక్ట్ ను కూడా పక్కనపెట్టి ఈ సినిమా చేస్తున్నారు. అయితే.. ఇందులో కథానాయికలు అంటే.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే మృణాల్ ఠాగూర్ ఉందని ప్రచారం జరుగుతుంది కానీ.. మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. అనకున్న ప్లాన్ ప్రకారం కంటే.. కాస్త ఎక్కువ స్పీడుతోనే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. బన్నీ పార్ట్ వరకు జూన్ లేదా జులైకు షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం.

Icon Star

Icon Star | కీలక పాత్రలో టైగర్ ష్రాఫ్‌..

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మూవీలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను బాలీవుడ్ యంగ్ హీరో (Hero) టైగర్ ష్రాఫ్ తో చేయించాలని అట్లీ డిసైడ్ అయ్యాడని.. ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని టాలీవుడ్, బాలీవుడ్ లో వినిపిస్తోంది. అలాగే ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే.. మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి కన్ ఫర్మేషన్ రాలేదు. ఇందులో మూడు లేదా నాలుగు లోకాలను చూపించబోతున్నారని.. అందుచేత ముగ్గురు లేదా నలుగురు కథానాయికలు కనిపించడం ఖాయం అంటున్నారు సినీజనాలు.

Icon Star

Icon Star | హాలీవుడ్ రేంజ్ లో..

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ఎంత టైమ్ తీసుకున్నారో.. పోస్ట్ ప్రొడక్షన్ కు (Post Production) అంతకు మించి తీసుకుంటారని టాక్. ఎందుకంటే.. హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్న మూవీ ఇది. అందుకనే హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా తీసుకున్నారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీ ఈ సినిమాని నిర్మిస్తుంది. అలాగే సన్ పిక్చర్స్ సంస్థ ఇంత వరకు తమిళ హీరోతోనే సినిమాలు నిర్మించింది. ఫస్ట్ టైమ్ తెలుగు హీరోతో సినిమా నిర్మిస్తుండడం విశేషం. ఈ క్రేజీ మూవీని 2026 ఎండింగ్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కుదరకపోతే 2027 సంక్రాంతికి ఈ పాన్ వరల్డ్ మూవీని రిలీజ్ చేస్తారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

Icon Star

CLICK HERE TO READ వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply