తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో పాలనాపరమైన వ్యవహారాలు, శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేర‌కు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యాపార పన్నుల, ఎక్సైజ్ శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న, 1999 బ్యాచ్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ కార్యదర్శిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ (FAC) బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో ఇప్పటి వరకు ఉన్న 2002 బ్యాచ్ ఎం.రఘునందన్ రావు.. ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. ఎం.రఘునందన్ రావును వ్యాపార పన్నుల కమిషనర్‌గా బదిలీ చేసి, కొత్తగా పోస్ట్ చేశారు. ఈ పదవిలో ఇప్పటి వరకు 2013 బ్యాచ్‌కి చెందిన కె.హరిత పనిచేస్తున్నారు. ఆమెను ఫైనాన్స్ శాఖలో స్పెషల్ సెక్రటరీగా నియమించారు. రవాణా కమిషనర్ పదవిలో ఉన్న ఎం.రఘునందన్ రావుకు FAC బాధ్యతలు కూడా అప్పగించారు, ఈ పదవిలో ఇప్పటి వరకు కె.సురేంద్ర మోహన్ (2006 బ్యాచ్) ఉన్నారు. ఆయన్ని వ్యవసాయ, సహకార శాఖలో సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన కో-ఆపరేటివ్ సొసైటీల కమిషనర్, రిజిస్ట్రార్, మార్కెటింగ్ డైరెక్టర్ పదవుల్లో FAC బాధ్యతలు కొనసాగిస్తారు.

Leave a Reply