ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

అమరావతి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్(IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో, గవర్నర్ కార్యదర్శి(Secretary to the Governor)తో సహా పలు కీలక శాఖల కార్యదర్శులను మార్చింది.

మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులను కొత్త స్థానాలకు నియమించారు. ఈ బదిలీల్లో ప్రధానంగా, గతంలో టీటీడీ ఈవో(TTD EO)గా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్‌కు మరోసారి అదే అవకాశం కల్పించారు. ప్రస్తుతం పోస్టింగ్‌ల‌ కోసం ఎదురుచూస్తున్నసింఘాల్‌ను టీటీడీకి తిరిగి నియమించారు.

దీంతో ఇప్పటివరకు టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావు(Shyamala Rao)ను జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు.మరో ముఖ్యమైన మార్పులో భాగంగా, వైద్యారోగ్యశాఖ(Medical and Health Department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంటీ కృష్ణబాబును రవాణా, రోడ్లు భవనాలశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

కృష్ణబాబు స్థానంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరవ్ గౌర్ ను నియమించారు.అదేవిధంగా, ముఖేష్ కుమార్ మీనాకు ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ప్రవీణ్ కుమార్నుఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమించారు.

గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నరిటైర్డ్ అధికారి(Retired Officer) హరి జవహర్ లాల్ స్థానంలో అనంతరాముకు అవకాశం కల్పించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్.శ్రీధర్‌ను నియమించారు. రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నకాంతిలాల్ దండేను అటవీ పర్యావరణశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

Leave a Reply