- తాళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి అంకని యశోధ
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని తాళ్లపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అంకని యశోద అన్నారు. శనివారం గ్రామంలో ప్రచారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి తాళ్లపల్లి గ్రామంలో ముమ్మర ప్రచారం చేశారు. గెలుపే ధ్యేయంగా దూసుకుపోతున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అంకని యశోద మాట్లాడుతూ… ఉంగరానికి ఓటేసి గ్రామ అభివృద్ధికి స్వాగతం పలకాలని ఆమె గ్రామస్తులను కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలన్నీసర్పంచ్ అభ్యర్థి పరిశీలించారు. గ్రామానికి మౌలిక సదుపాయాలు సమకూర్చడమే తమ లక్ష్యమని గ్రామ ఓటర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప్రవీణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

