హైదరాబాద్ : సీతారాంబాగ్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. “ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. రాముడు ఏం చేసినా ధర్మ రక్షణకోసం చేశాడు. భగవాన్ రామ్ ధర్మ స్థాపనకు మార్గదర్శకుడు. భారత దేశా సంసృతి.. సంప్రదాయాలకు రాముడు ఆదర్శం. ప్రతి పౌరుడు భగవాన్ శ్రీరామ్ ను ఆదర్శం తీసుకోవాలి. ఆయన మార్గంలో నడిచి దేశాభివృద్ధికి పాటు పడాలి. ప్రధాని మోడీ సబ్ కా సబ్ కా వికాస్ పేరుతో రామ మార్గంలో నడుస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అనంతరం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి శోభయాత్రను గవర్నర్ ప్రారంభించారు. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభా యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ శోభా యాత్ర కోఠి వ్యాయామశాల వరకు జరుగుతుంది. శోభాయాత్ర హనుమాన్ వ్యాయామశాల స్కూల్, సుల్తాన్‌బజార్ మీదుగా బోయిగూడ కమాన్, మంగల్‌హాట్ పీఎస్ రోడ్డు, జాలి హనుమాన్, ధూల్‌పేట, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమేరత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్ బజార్, ఎస్‌ఏ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, రామమందిల్ కమాన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్‌రోడ్, డీఎం హెచ్ ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్, రాయల్ ప్లాజా టీ జంక్షన్ ప్రాంతాల్లో జరుగుతుంది.
ధూల్‌పేట మాగ్రా నుంచి
శ్రీరామ నవమి పాల్కీ యాత్రను మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర సాగుతుంది. ధూల్‌పేట గంగాబౌలి నుంచి కోఠి హనుమాన్ టెక్డీ వరకు సాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్రను రాజాసింగ్ ప్రాఉరంభించారు. ఈ మూడు యాత్రలు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్డులోని అనిత టవర్ వద్ద కలుస్తాయి. పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడ, పుత్లీబౌలి మీదుగా కోఠీ హనుమాన్ టేక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితోపాటు పలు దేవుళ్ల విగ్రహాలుంటాయి.
సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
దాదాపు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.శోభాయాత్ర మార్గమంతా అడుగడుగున సీసీ కెమెరాల నిఘా కొనసాగనుంది. శోభాయాత్ర పర్యవేక్షణ కోసం జాయింట్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతలో భాగంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులు శోభాయాత్రను మానిటర్ చేస్తున్నారు