Hyderabad | మియాపూర్‌ లో లారీ బీభత్సం : హోమ్ గార్డ్ మృతి

హైదరాబాద్ : మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌పైకి లారీ దూసుకెళ్లింది.

అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాఫిక్‌ విధులు ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్‌ సింహాచలం మరణించారు.

కానిస్టేబుళ్లు వికేందర్‌,రాజవర్థన్‌లు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply