Hyderabad | ఇద్దరు పిల్లల గొంతునులిమి.. తల్లి ఆత్మహత్య..

Hyderabad | ఇద్దరు పిల్లల గొంతునులిమి.. తల్లి ఆత్మహత్య..

Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇద్దరు పిల్లల గొంతునులిమి.. ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ నగరంలోని బోరబండలో చోటుచేసుకుంది. బోరబండలోని పెద్దమ్మనగర్‌లో గృహిణి సత్యవాణి ఇద్దరు పిల్లల గొంతు నులిమి.. తనూ ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనలో ఐదేళ్ల కుమారుడు మృతిచెందగా, రెండేళ్ల కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కుటుంబ కలహాలతో ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Hyderabad |

Leave a Reply