Hyd | నెహ్రూ జూ పార్క్‌కి కొత్త అతిథులు..

  • ఎన్‌క్లోజర్‌లో సర్వల్ కాట్స్ !

హైదరాబాద్: నగరంలోని ప్రసిద్ధ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ (NZP) తన జంతు సంపదను మరింత విస్తరించింది. ఆఫ్రికా ఖండానికి ప్రత్యేకమైన అరుదైన జాతి సర్వల్ కాట్స్ జతను ఈరోజు (ఆదివారం) ప్రజలకు ప్రదర్శన కోసం ఎన్‌క్లోజర్‌లో విడుదల చేశారు. ఈ సర్వల్ కాట్స్‌ జంతువులు జూ పరిధిలో సుమారు 16 ఏళ్ల వరకు జీవించగలవని అధికారులు తెలిపారు.

కొత్తగా సర్వల్ కాట్స్‌ తో జూ పార్క్‌లోని జంతువుల సంఖ్య 195 జాతులుకి చేరిందని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌ (HoFF) డా. సి సువర్ణ వెల్లడించారు. జూ పార్క్‌లో జరుగుతున్న బ్రీడింగ్ ప్రోగ్రాం ప్రత్యేకతగా కొనసాగుతోందని, దాదాపు అన్ని జాతులను జూ పరిధిలో విజయవంతంగా పెంపొందించగలమని ఆమె చెప్పారు.

కాగా, సర్వల్ కాట్స్‌ ను ఎన్‌క్లోజర్‌ లోకి ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌ (HoFF) డా. సి సువర్ణ పునరుద్ధరించిన ఫాసిల్ పార్క్ గార్డెన్ ను ప్రారంభించారు. ఈ గార్డెన్‌ ను తెలంగాణ మ్యాప్ ఆకృతిలో రూపొందించి పలు వృక్షాలను నాటినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply