HYD| యశోద ఆస్పత్రిలో క్యాన్సర్ల సర్జరీలపై లైవ్ వర్క్ షాప్…

హైద‌రాబాద్, జులై 26 (ఆంధ్ర‌ప్ర‌భ) : యశోద హాస్పిటల్స్ (yashodahospitals) -హైటెక్ సిటీలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ రోబోటిక్ సైన్స్ విభాగం జీఐ-ఫోకస్ పేరుతో రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీఐ) క్యాన్సర్‌ వరకు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విదానాలను దేశంలోనే ప్రసిద్ధ జాతీయ సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకాలజీ అండ్ జనరల్ సర్జరీ రంగాల నుండి 500మందికి పైగా సర్జన్లతో ప్రత్యక్ష లైవ్ వర్క్ షాప్ అండ్ ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ నిర్వహించారు.

ఈసందర్భంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్.జి.ఎస్.రావు మాట్లాడుతూ… అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జికల్ ఎక్సలెన్స్ ద్వారా మాత్రమే కాకుండా, వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే ఇలాంటి వేదికల ద్వారా కూడా రోగికి మెరుగైన ఫలితాలను అందించవచ్చని ఇలాంటి సదస్సులు నిరూపిస్తున్నాయన్నారు. ప్రత్యేక సంరక్షణ అవసరమయ్యే వ్యాధుల పెరుగుదల, సంక్లిష్టతకు ప్రతిస్పందనగా, యశోద హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో బారియాట్రిక్, హెర్నియా, ప్యాంక్రియాస్, రోబోటిక్, లివర్ క్లినిక్‌లతో సహా స్పెషాలిటీ క్లినిక్‌లను ప్రారంభించినట్లు తెలిపారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, డా.విజయకుమార్ బడా మాట్లాడుతూ… గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఫోకస్ అనేది జీర్ణశయాంతర ఉదరకోశ క్యాన్సర్ నిర్వహణలో అత్యాధునిక క్లినికల్ ఆవిష్కరణ అన్నారు. ఈ రెండు రోజుల జాతీయ కాన్ఫరెన్స్ అండ్ లైవ్ వర్క్ షాప్ లో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అధునాతన జీర్ణ-ఉదరకో శస్త్ర చికిత్స వ్యూహాలు, మల్టీమోడల్ చికిత్స ప్రణాళికపై నిపుణుల నేతృత్వంలోని లైవ్ సెషన్లు యువ సర్జన్లకు ఒక గొప్ప వేదిక అన్నారు. గ్యాస్ట్రో సర్జరీలు విజయవంతంగా ఎలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన యువ సర్జన్లకు (ప్రత్యక్ష ) లైవ్ సర్జికల్ వర్క్ ‌షాప్ ద్వారా వివరించారు.

Leave a Reply