HYD | ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్

HYD | ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్
HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : డిజిటల్ డిపాజిట్ల పేరిట రూ.850 కోట్లకు పైగా వసూలు చేసిన ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణం కేసులో సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు ముంబయిలో (Mumbai) అరెస్టు చేశారు. లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో గల్ఫ్ నుంచి ముంబయికి వచ్చిన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీకి సమాచారం అందించారు.
యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్ల పేరిట పెట్టుబడిదారులను మోసం చేసిన ఫాల్కన్ సంస్థ కుంభకోణం తెలంగాణలో సంచలనం రేపింది. సంస్థ ఎండీ అమర్‌దీప్ రూ.850 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సీఐడీ (CID) దర్యాప్తులో తేలింది. కేసు నమోదైన తర్వాత అమర్‌దీప్ దేశం విడిచి గల్ఫ్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అతడిపై లుకౌట్ నోటీసులు (Notice) జారీ చేశారు. గల్ఫ్ నుంచి ముంబయికి వచ్చిన ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి సీఐడీ పోలీసులకు అప్పగించారు. సీఐడీ బృందం ముంబయికి చేరుకుని అమర్‌దీప్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించనుంది.
ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.
