భర్త కిరాతకం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. నైతిక విలువలు లోపిస్తున్నాయి. అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధానికి ఓ మహిళ బలయింది. ఈ రోజు నంద్యాల (Nandyal) పట్టణం ఎన్జీవో కాలనీలో జరిగిన దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనం. కట్టుకున్న భార్య (Wife) ను కత్తితో కడతేర్చిన సంఘటన జరిగింది.
రెండో పట్టణ సీఐ అస్రార్ భాష తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలో పౌరోహిత్యం చేసి జీవనం సాగిస్తున్న సాయినాథ్ శర్మ (Sainath Sharma) కట్టుకున్న భార్య శిరీషను కత్తితో గొంతు కోసి హత్య చేశాడని తెలిపారు. భార్య శిరీష (Sirisha) పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో తరచూ ఇద్దరూ పరస్పరం గొడవపడేవారు. ఈరోజు ఉదయం కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు ఘర్షణలు పడ్డారు. ఈ క్రమంలో కత్తితో దాడి (Knife attack) చేసి హత్యచేశాడు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. టూ టౌన్ పోలీసులు (Two Town Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.