Hundi | నాగదేవుతా హుండి ఆదాయం రూ. 8,93,797

Hundi | నాగదేవుతా హుండి ఆదాయం రూ. 8,93,797

Hundi | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఈ నెల 18 నుంచి 25 వరకు జరుగగా భక్తులు కట్నం కానుకల రూపములో సమర్పించిన హుండీ ఆదాయం మంగళవారం నాడు లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం 8,93,797 లు వచ్చినట్లు ఇఓ తెలిపారు. 0.252 గ్రాముల వెండి వచ్చినట్లు తెలియ జేశారు.

తై బజార్ ఆదాయం తో పాటు ఖర్చుల వివరాలను దీంతో జాతర లో వచ్చిన ఆదాయo, ఎండోమెంట్ ప్రకారంగా ఖర్చులు, మిగిలిన అమౌంట్ వెల్లడించడం ఆన‌వాయితీ. ఈ సందర్భంగా ఐటిడిఏ అధికారులు, పోలీస్ సీబ్బందులు, పూర్తి బందోబస్తుతో మేశ్రమ వంశీయుల ఉద్యోగా సంఘం పీఠాధిపతి, మేశ్రమ పీఠాధిపతి వెంకటరావు, ఆలయ చైర్మన్ ఆనంద్ రావు, సర్పంచ్ మేశ్రమ తుకారం, పూజారి, సేకు ఉద్యమ సంఘం మెస్రం సోనే రావు, మేశ్రమ శేఖర్, మేశ్రమ మనోహర్, ఉద్యోగ సంఘం ఉపాధ్యాయులు, మేశ్రమ రెడ్డి పటేల్, కటోడా హనుమంతరావు, మేస్రం కోసేరావులు ఉన్నారు.

Leave a Reply