అమరావతి : వైసీపీ (YCP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT)లో భారీ ఊరట లభించింది. తన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) పేరు మీద తల్లి వైఎస్ విజయమ్మ (YS Vijayamma) అక్రమంగా షేర్లను బదిలీ చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. అదేవిధంగా షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఆ పిటిషన్‌పై ఈనెల 15న విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. ఇవాళ తాజాగా జగన్ పిటిషన్‌పై NCLT సంచలన తీర్పును వెల్లడించింది. వైఎస్ షర్మిల, విజయమ్మ సరస్వతీ షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని NCLT ఆదేశాలు జారీ చేసింది.