ఎన్నిరోజులంటే..?

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో(In the state)ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవులను ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఉంటాయ‌ని, జూనియర్ కళాశాలల(junior colleges)కు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు మొత్తం 8 రోజుల పాటు సెలవులు వర్తిస్తాయ‌ని వివ‌రించింది. సెలవుల ప్రకటనతో విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయాణ ఏర్పాట్లను మొదలుపెట్టారు.

ఈ నిర్ణయం రాష్ట్రంలో పండుగ వాతావరణాన్నిమరింత పెంచింది. ఈ సెలవుల్లో చాలా మంది విద్యార్థులు టూర్లకు ప్లాన్(plan) చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలకు వెళ్లాలని, స్నేహితులతో విహారయాత్రలు చేయాలని ఆలోచిస్తున్నారు.

మరోవైపు(on the other hand).. దసరా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ(Bathukamma) ఉత్సవాలు కూడా విద్యార్థుల(students) సెలవులను మరింత ఆనందభరితంగా మారుస్తాయి. ఉద్యోగులు కూడా ఈ వరుస సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply