విద్యుత్ స్తంభాలు ఇలా.. రైతుల అవస్థలు తీరేదెలా?

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal District)లో విద్యుత్ శాఖ (Electricity Department) అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీశైలం నియోజకవర్గం (Srisailam Constituency) పరిధిలోని మహానంది మండలంలో గాలి వానకు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి ప్ర‌మాద‌క‌రంగా మారాయి. బొల్లవరం గ్రామంలోని వరి పంట పొలాల్లో ప్రధాన విద్యుత్ స్తంభం నేల వాలింది. ఈ విష‌యం స్థానిక రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ శాఖ ఏఈ (Electricity Department AE) ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైతుల స‌హ‌కారంతో లైన్‌మ‌న్ (Lineman) భాస్కర్, అనిల్ విద్యుత్తు లైన్‌ను పునరుద్ధరించారు. దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply