క్షేత్ర‌స్థాయిలో ఇండ్ల నిర్మాణ పురోగ‌తి

క్షేత్ర‌స్థాయిలో ఇండ్ల నిర్మాణ పురోగ‌తి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పెద్ద‌వూర మండ‌లానికి 566 ఇందిర‌మ్మ(Indiramma) ఇండ్లు మంజూరయ్యాయి. పెద్ద‌వూర మండ‌ల ప‌రిధిలోని బట్టుగూడ గ్రామ‌పంచాయ‌తీ(Gram Panchayat) జంగాల కాల‌నీలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం పురోగ‌తిని క్షేత్ర‌స్థాయిలో ఎంపీడీవో అధికారి ఉమాదేవి ప‌రిశీలించారు.

వీటిలో 114 ఇళ్ల బేస్మెంట్స్ నిర్మాణం పూర్తి చేశారు. వీరంద‌రికీ వారం రోజుల్లో(within a week) బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు జ‌మ అవుతాయ‌ని తెలిపారు. పంచాయితీ కార్య‌ద‌ర్శి బేస్మెంట్ నిర్మాణం పూర్త‌యిన వాటి ఫోటో క్యాప్చ‌ర్(photo capture) చేసి, హౌసింగ్ ఏఈ ఫోటో క్యాప్చ‌ర్ చేస్తార‌నీ, అదేవిధంగా ల‌బ్ధిదారు వారి ఫోన్లో యాప్ ద్వారా కూడా స్వ‌యంగా ఫోటో క్యాప్చ‌ర్ చేసుకోవ‌చ్చ‌న్నారు.

ఇంటి నిర్మాణాల‌(Constructions)ను త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయితీ కార్య‌ద‌ర్శి నాగిరెడ్డి, ఇండ్ల ల‌బ్ధిదారులు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు566 ఇండ్లు మంజూరు

Leave a Reply