HOUSE | పేదోడి గూడుకు చేయూత
25 వేల ఆర్థిక సాయం అందించిన బండి రామకృష్ణ
HOUSE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నియోజకవర్గం వాడపాలెం గ్రామంలో నిరుపేదలైన అన్నాచెల్లెళ్లు ముంథా తుఫాన్ వల్ల ఇల్లు కోల్పోయారు. నాలుగు వెదురు కర్రలపై టార్పాలిన్ పట్టాతో నివాసం ఉంటున్నారు. వారి నిస్సహాయ స్థితిని గమనించి దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దారపురెడ్డి చంటి, ఘంటసాల బుజ్జి సహకారంతో నూతన ఇల్లు ఏర్పాటుకు రూ.25 వేల ఆర్థిక సహాయం ఎర్రబోతు ఆంజనేయులు వారి సోదరికి మచిలీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణాజిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ (DCMS Chairman Bandi Ramakrishna) అందించారు.ఇంటి నిర్మాణానికి పార్టీ మండల అధ్యక్షులు గళ్లాతిమోతి గ్రామస్తులు కూడా తమవంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. ఆర్థిక సహాయంతో పాటు పై కప్పు నిర్మాణానికి రేకులు కూడా అందిస్తానని బండి రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డంరాజు సీతారామయ్య, యానాదిరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిచ్చయ్య, మాదాసు నాగరాజు, వడ్డీ హరిసాయి, వాడపాలెం గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

