Hot Topics | పుతిన్…
- భారత్‌కి వచ్చెన్
Hot Topics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నాలుగేళ్ల తర్వాత విచ్చేసిన ఆప్తమిత్రుడికి భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి మరీ భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) పుతిన్‌ను స్వయంగా కలిసి స్వాగతం పలికారు. సరైన సమయంలో భారత్ కి వచ్చిన పుతిన్ భారత్‌తో ఏయే అంశాల మీద చర్చించబోతున్నారు? ఇరుదేశాలకూ కలగబోయే ప్రయోజనాలేమిటి? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
ముందుగా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా పుతిన్ కు ఇవ్వబోతున్న విందు. ప్రత్యేకంగా ఈ విందులో వడ్డించబోయే పదార్థాలేమిటి? అందులో పుతిన్ కు ఇష్టమైనవి ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు భారత్ లో చర్చించుకుంటున్న హాట్ టాపిక్స్(Hot Topics)గా మారింది. రెండు రోజులు భారత్ లో ఉండి చర్చలూ-పర్యటనలతో బిజీ బిజీగా గడపబోతున్న పుతిన్ షెడ్యూల్…తిరిగే ప్రదేశాలు…తినే పదార్థాలు…ఆయన చుట్టూ ఉండే నాలుగంచెల భద్రత పైనే ప్రస్తుతం భారత దేశం(India)లోని ప్రతి ఒక్కరి దృష్టి ఉంది.
అవును మరి.. ట్రంప్ బెదిరింపులనూ-ఒత్తిళ్ళను సైతం లెక్కచేయక కలకాలం కలిసుండాలనుకునే మిత్ర దేశాలు భారత్-రష్యా. ఈ ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలపై ప్రపంచదేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయ్ మరి.

