Hot Comments | వక్ఫ్ బోర్డు పేరుతో వేలాది ఏక‌రాల‌ను దోచుకున్న కాంగ్రెస్ – మోడీ

హిస్సార్ – హ‌ర్యానాః ఎస్సీ, ఎస్టీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, వక్ఫ్ బోర్డు పేరుతో కాంగ్రెస్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు ప్ర‌ధాని మోడీ. హర్యానా హిస్సార్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయ‌న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్‌ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను మోసం చేసిందని, వాళ్ల రిజర్వేషన్లను చీల్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. వక్ఫ్ వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పేద ముస్లింలు పంచర్ షాపులకే పరిమితమయ్యారని అన్నారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు పేరుతో రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఒక్క ముస్లింని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించలేదు, ఎందుకు..? అని మోడీ ప్రశ్నించారు.

వక్ఫ బోర్డు పేరiతో లక్షల హెక్టార్ల భూమిని కొల్లగొట్టారని, వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు, ఆదివాసుల భూముల్ని లాక్కున్నారని మోడీ ప‌డ్డారు. పేద ముస్లిం మహిళలు, వితంతు మహిళలు కేంద్ర ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డుపై లేఖలు రాశారని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్‌నే పెద్దదిగా చేసిందని అన్నారు.

2014కు ముందు దేశంలో 74 ఏయిర్‌పోర్టులు ఉంటే, ఈ రోజు 150 ఎయిర్‌పోర్టలు ఉన్నాయని మోడీ అన్నారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో 74ఏయిర్ పోర్టులు మాత్రమే నిర్మించిందని అన్నారు. బీజేపీ పాలనలో కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. పేదల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *