Hospital | చౌట్‌పల్లి పీహెచ్‌సీన‌ తనిఖీ….

Hospital | చౌట్‌పల్లి పీహెచ్‌సీన‌ తనిఖీ….

Hospital | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు సిబ్బంది, హాజరు పట్టిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. అదేవిధంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కాన్పు లను పరిశీలించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారిని డాక్టర్ స్పందనని ఆదేశించారు. మహిళా ఆరోగ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ స్పందన, ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకుడు స్వరూప, పద్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply