మానవత్వం చాటుకున్న విసన్నపేట ఎస్సై అర్జున్ రాజు..

మానవత్వం చాటుకున్న విసన్నపేట ఎస్సై అర్జున్ రాజు..
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : విస్సన్నపేట పోలీసులు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన విస్సన్నపేట మండలం కలగర గ్రామానికి చెందిన అల్లాడ కృష్ణకుమారిని ఎస్సై ఎం అర్జున్ రాజు తన సిబ్బంది సహాయంతో తమ వాహనంలో క్షతగాత్రురాలిని ఎక్కించుకొని విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. దీంతో కృష్ణకుమారి భర్త మారేశ్వరరావు ఎస్సై అర్జున్ రాజుకు పోలీసు కానిస్టేబుళ్లు రాంప్రసాద్ నాగేశ్వరావు వంశీ హరి గణేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
